ప్రభుత్వ ఉద్యోగులపై టియర్ గ్యాస్ ఫైర్..

by Mahesh |
ప్రభుత్వ ఉద్యోగులపై టియర్ గ్యాస్ ఫైర్..
X

దిశ, వెబ్‌డెస్క్: హర్యానాలో పాత పెన్షన్ స్కీమ్ OPS ను పునరుద్దరణ చేయడం కోసం ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు దిగారు. సుమారు. 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిరసనలో పాల్గాన్నారు. దీంతో వారిని అదుపు చేసేందుకు ఆదివారం సాయంత్రం పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అలాగే వాటర్ ఫిరంగులను కూడా ఉపయోగించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చండీగఢ్‌లోని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నివాసం వద్ద 70,000 మంది ఉద్యోగులు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు.

Advertisement

Next Story