- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tarrifs: మార్చి 4 నుంచి కెనడా, మెక్సికోలపై సుంకాలు.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే నెల 4వ తేదీ నుంచి మెక్సికో (Mexico), కెనడా (Canada)లపై సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. అలాగే చైనా దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 10 శాతం సుంకాన్ని రెట్టింపు చేశారు. ఈ మేరకు ట్రంప్ గురువారం తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఫెంటానిల్ వంటి మాదకద్రవ్యాలు అధిక మోతాదులో అమెరికాలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, దిగుమతి పన్నులతో ఇతర దేశాలు అక్రమ రవాణాను అరికట్టవలసి వస్తుందని తెలిపారు. ప్రతిపాదిత సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఆ తేదీ నుంచి చైనాకు అదనంగా 10 శాతం సుంకం విధిస్తామని పేర్కొన్నారు. కాగా, అమెరికా ప్రధాన వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తే, ద్రవ్యోల్బణం పెరిగి ఆటో రంగం ప్రభావితమవుతుందని పలువురు భావిస్తున్నారు.
ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కుదరదు
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి కేటినెట్ భేటీ నిర్వహించిన ట్రంప్ ఉక్రెయిన్ (Ukrein) పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు నాటో (Nato) సభ్యత్వం కుదరదని, అది మర్చిపోవాల్సిన అంశమని తెలిపారు. యుద్ధానికి ఈ సమస్యే కారణమైందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ భద్రతకు యూరోపియన్ యూనియన్ మద్దతిచ్చే చాన్స్ ఉందని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ త్వరలోనే అమెరికాను సందర్శించి ఉక్రెయిన్ ఖనిజ వనరులను యూఎస్‌కు అందుబాటులోకి తెచ్చే ఒప్పందంపై సంతకం చేయనున్నారనే కథనాల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.