- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Tarrifs: టారిఫ్స్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లకు మినహాయింపు.. ట్రంప్ కీలక నిర్ణయం !

దిశ, నేషనల్ బ్యూరో: టారిఫ్స్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పరస్పర సుంకాల నుంచి స్మార్ట్‌ఫోన్లు (Smart phones), కంప్యూటర్లు (Computers), సెమీ కండక్టర్ చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మినహాయించారు. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఈ విషయాన్ని వెల్లడించింది. కొన్ని వస్తువులను సుంకాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తన నోటీసులో పేర్కొంది. ఈ వస్తువులలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డ్రైవ్‌లు, కంప్యూటర్ ప్రాసెసర్‌లు, మెమరీ చిప్‌లు ఉన్నాయి. ఈ ఉత్పత్తులకు అమెరికాలో అధిక డిమాండ్ ఉంది. కానీ అవి ఎక్కువగా చైనా, కొరియా, వియత్నాం వంటి దేశాల్లో తయారు చేయబడతాయి.
వీటిపై భారీ పన్నులు విధిస్తే, కంపెనీలు నష్టపోవడంతో పాటు కస్టమర్లకు సైతం ఈ వస్తువులు ఖరీదైనవిగా మారతాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలతో పాటు యాపిల్ (Apple), శాంసంగ్ (Samsung), పలు టెక్ కంపెనీలకు కూడా ఉపశమనం లభించనుంది. ఆయా కంపెనీలు ఇటీవల అమెరికాలో ఎలక్ట్రానిక్స్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ఈ మినహాయింపులు తాత్కాలికమేనని పలువురు భావిస్తున్నారు. త్వరలోనే వాటిపై కూడా సుంకాలు (Tarrifs) విధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.