- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డదారులు.. డేటు ముగిసిన డేటా మార్చి

దిశ, కోదాడ : ఇంటి నిర్మాణానికి, వెంచర్ వేయాలనుకున్న, రోడ్ల నిర్మాణం ఇరువైపులా లెవల్ చేయడానికి ఇలా ప్రతి అవసరానికి మట్టి మరమ్మతులు కీలకంగా మారాయి. దీంతో నిత్యవసర వస్తువుల జాబితాలో మట్టి ఒకటిగా చేరిపోయింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు అంగన్వాడీ గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణాలు గృహ నిర్మాణాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు మట్టి తవ్వకాలకు పర్మిషన్లను కొంతమేర ఇచ్చింది ప్రభుత్వ నిబంధన ప్రకారం మట్టి తవ్వకాలు జరపాలని ఆదేశాలు జారీ చేస్తూ పర్మిషన్ లెటర్లను అందజేసింది. ఈ లెటర్ ను అందుకొని కొంతమంది మట్టి తవ్వకాలను జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ మండలంలోని కాపుగల్లు గ్రామ శివారులోని మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.
అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మట్టి తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు.జనవరి 16 నుంచి ఫిబ్రవరి 4 వరకు పర్మిషన్ తీసుకొని సిహెచ్ వెంకయ్య కంపెనీ పేరు తోటి పర్మిషన్ తీసుకొన్నారు. ఇక్కడే కేటుగాళ్లు తమ వంకర బుద్ధి చూపించి పర్మిషన్ లెటర్ ను జూన్ 4 వరకు ఉన్నట్లు సృష్టించి అక్రమంగా మట్టి తోలుతు ప్రభుత్వ నిబంధనలోనూ తుంగలో తొక్కారు.సమాచారం తెలుసుకున్న ఇన్చార్జ్ మైనింగ్ ఏడి విజయరామరాజు సంఘటన స్థలానికి చేరుకొని ఒక ప్రోక్లైన్ అయిదు టిప్పర్లను సీజ్ చేసినట్టు తెలిపారు. ఆయన వెంట టెక్నికల్ అసిస్టెంట్ ఈ వెంకన్న, ఆర్ఐ జగదీష్, పోలీసు సిబ్బంది ఉన్నారు