దేశ సంస్కృతి, వారసత్వాన్ని ద్వేషించే డీఎంకేను ప్రజలు తిరస్కరిస్తారు: ప్రధాని మోడీ

by S Gopi |
దేశ సంస్కృతి, వారసత్వాన్ని ద్వేషించే డీఎంకేను ప్రజలు తిరస్కరిస్తారు: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కలలు కన్న వారిని జమ్మూ కశ్మీర్ ప్రజలు తిరస్కరించారని, తమిళనాడు కూడా అదే పని చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ, తమిళనాడు భవిష్యత్తుకు, సంస్కృతికి డీఎంకే శత్రువని, అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ప్రసారాన్ని నిషేధించారని ఆరోపణలు చేశారు. ఈ దేశాన్ని, సంస్కృతిని, వారసత్వాన్ని డీఎంకే ద్వేషిస్తోంది. ఈ దేశాన్ని విభజించాలని భావించిన వారిని జమ్మూ కశ్మీర్ ప్రజలు తిరస్కరించారని, తమిళ నాడు ప్రజలు కూదా అదే తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రజలను దోచుకునేందుకు డీఎంకే, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చూస్తున్నాయి. 2జీ స్కామ్‌లో డీఎంకే అతిపెద్ద లబ్దిదారు అని మోడీ పేర్కొన్నారు. ఇదే సమయంలో డీఎంకే, కాంగ్రెస్‌లు మహిళా వ్యతిరేకి అని, అవి కేవలం మహిళలను మోసం చేసి అవమానించాయని ఆరోపించారు. మహిళలను అవమానించడం, మోసం చేయడం ఇరు పార్టీలకు అలవాటుగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జయలలితతో ఎలా వ్యవహరించారో తమిళనాడు ప్రజలకు తెలుసునని వెల్లడించారు. అలాంటి సంస్కృతి నేటికీ కొనసాగుతోందని, రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయన్నారు. బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, కానీ ఇండియా కూటమి స్కామ్‌లు చేస్తుందని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed