Bilkis Bano case: బిల్కిస్ బానో దోషులకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

by Harish |
Bilkis Bano case: బిల్కిస్ బానో దోషులకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని గోద్రాలో 2002లో జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి, ఆమె కుటుంబాన్ని చంపిన కేసులో దోషులుగా తేలిన 11 మందిలో ఇద్దరు.. రాధేశ్యామ్ భగవాన్‌దాస్, రాజుభాయ్ బాబులాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం షాకిచ్చింది. వారు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌లను కొట్టివేసింది. 2022లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున క్షమాభిక్షతో గుజరాత్ ప్రభుత్వం వీరిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, దానిని ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో వారు దీన్ని సవాల్ చేస్తూ మధ్యంతర బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేయగా, దానిని విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించి కొట్టివేసింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం దీనిని తప్పుడు పిటిషన్‌గా పేర్కొంది.

గోద్రా అల్లర్ల సమయంలో 5 నెలల గర్భిణి అని చూడకుండా బిల్కిస్ బానో‌పై నిందితులు సాముహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు, ఆమె కుటుంబానికి చెందిన 7 మందిని చంపారు. ఈ కేసులో మొత్తం 11 మందికి సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21వ తేదీన జీవిత ఖైదు విధించింది. ఆ తరువాత ఒక నిందితుడు 2022లో తమను విడుదల చేయాలని కోరుతూ, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాడు. దీంతో దీనిని చూడాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కోరడంతో 11 మందిని రిమిషన్ విధించడంతో వారంతా కూడా విడుదలయ్యారు. ఆ తర్వాత గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వచ్చి్ంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ వారి విడుదల చెల్లదని, రెండు వారాల్లోగా జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో గుజరాత్ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దుచేసి నిందితుల్ని మళ్లీ అరెస్ట్ చేసింది. తాజాగా వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.



Next Story