Supreme court: కన్జ్యూమర్ బాడీ సభ్యులకూ వేతనాలు చెల్లించాలి.. రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

by vinod kumar |
Supreme court: కన్జ్యూమర్ బాడీ సభ్యులకూ వేతనాలు చెల్లించాలి.. రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్ర, జిల్లా వినియోగదారుల ఫోరం సంస్థల చైర్మన్‌లు, సభ్యులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం జీతాలు, ఇతర బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు (Supreme court) ఆదేశించింది. అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మోడల్ రూల్స్- 2020ని సవరించడంపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా (Abhay Okha), ఎన్ కోటీశ్వర్ సింగ్‌ (Kotishwar singh)లతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి సైతం ఆర్డర్స్ జారీ చేసింది. వినియోగదారుల ఫోరం సభ్యుల జీతాలు, సేవా పరిస్థితులకు సంబంధించిన పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

ఈ తరహా కేసుల్లో లేవనెత్తిన వివిధ వివాదాలను పక్షపాతం లేకుండా పరిష్కరించాలని, చైర్మన్లు, సభ్యులకు వెంటనే ప్రోత్సాహకాలు అందించేలా చూడాలని తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఆర్టికల్ 142 (Article 142) ప్రకారం అధికారాలను ఉపయోగించే విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించింది. కోర్టు ఆదేశాలతో రాష్ట్రాల వినియోగదారుల సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది.

Next Story

Most Viewed