Stalin: భాషా సమానత్వాన్ని డిమాండ్ చేయడం తప్పుకాదు.. సీఎం స్టాలిన్

by vinod kumar |
Stalin: భాషా సమానత్వాన్ని డిమాండ్ చేయడం తప్పుకాదు.. సీఎం స్టాలిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు (Thamilnadu)లో త్రి భాషా విదానంపై వివాదం నేపథ్యంలో సీఎం స్టాలిన్ (Stalin) మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భాషా సమానత్వాన్ని డిమాండ్ చేయడం తప్పు కాదని, అది ప్రతి రాష్ట్ర హక్కు అని అన్నారు. కొంత మంది హిందీని ఇతర భాషల కంటే ఎక్కువగా ఉంచాలని కోరుకుంటున్నారని, హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘భాషా సమానత్వాన్ని డిమాండ్ చేయడం దురభిమానం కాదు. 1.4 బిలియన్ పౌరులను నియంత్రించే మూడు క్రిమినల్ చట్టాలను తమిళప్రజలు చదవలేని, మాట్లాడలేని, అర్థం చేసుకోలేని భాషలో తీసుకొచ్చారు. ఇదే అసలైన దురభిమానం’ అని తెలిపారు.

గాడ్సే భావజాలాన్ని కీర్తించే వారు ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే), దాని ప్రభుత్వ దేశభక్తిని ప్రశ్నించలేరని పేర్కొన్నారు. చైనా దండయాత్ర, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, కార్గిల్ యుద్ధంలో తమిళనాడు అత్యధిక మొత్తంలో నిధులను అందించిందని గుర్తు చేశారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ని నిరాకరించినందుకు రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాను నిరాకరించడం సరికాదని కేంద్రంపై ఫైర్ అయ్యారు. కాగా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra pradhaan), తమిళనాడు సీఎం స్టాలిన్ మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్ఈపీని అమలు చేయాలని కేంద్రం చెబుతుండగా దానిని స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేరిస్తున్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed