SSC GD Admit Card-2025: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. SSC GD అప్లికేషన్ స్టేటస్ విడుదల

by Shiva |
SSC GD Admit Card-2025: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. SSC GD అప్లికేషన్ స్టేటస్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: SSC GD కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు అప్లికేషన్‌ స్టేటస్‌ తెలుసుకునేందుకు అన్ని ఏర్పాటు చేసింది. దీంతో అభ్యర్థులు తమ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ GD, SSF, రైఫిల్‌మ్యాన్ (GD) పరీక్ష అడ్మిట్ కార్డ్ 2025 అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచనుంది. అదేవిధంగా SSC GD కానిస్టేబుల్ హాల్ టికెట్ పరీక్షకు మూడు నాలుగు రోజుల ముందు విడుదల చేయనున్నారు. SSC GD కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్-2025 పీడీఎఫ్‌ను అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్‌ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీ అప్లికేషన్‌ను చెక్ చేసుకోండి ఇలా..

Step-1: SSC అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.gov.in/ ఓపెన్‌ చేయాలి.

Step-2: హోమ్‌పేజీలో https://ssc.gov.in/loginలో కొత్త పేజీ ఓపెన్‌ చేయడానికి ‘లాగిన్’ ఆప్షన్ క్లిక్ చేయండి.

Step-3: అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ (SSC రిజిస్ట్రేషన్ పాస్‌వర్డ్) ఎంటర్‌ చేయాలి.

Step-4: స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.

Step-5: ‘లాగిన్’ క్లిక్ చేసినప్పుడు.. మీరు దరఖాస్తు చేసుకున్న అన్ని పరీక్షల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

Step-6: ‘అడ్మిషన్ సర్టిఫికేట్ స్టేటస్’పై క్లిక్ చేసి ఎగ్జామ్ పేరును సెలెక్ట్ చేసుకోవాలి.

Step-7: SSC GD పరీక్ష సిటీ, అప్లికేషన్ స్టేటస్ స్లిప్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

Step-8: పరీక్ష డేట్, టైమ్, సిటీ సెలక్షన్‌ను చెక్‌ చేసుకోవాలి.

అయితే, SSC GD కానిస్టేబుల్ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు ఫిబ్రవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం 14 రోజుల పాటు కొనసాగనే ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ పరీక్షలతో కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌ మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టులను అధికారులు భర్తీ చేయనున్నారు.


Next Story

Most Viewed