- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహారాష్ట్ర సీఎం షిండేకు షాక్!: ఆ సెగ్మెంట్‌లో అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని రత్నగిరి-సింధుదుర్గ్ స్థానం నుంచి కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణేను బీజేపీ బరిలోకి దింపింది. ఈ మేరకు గురువారం ప్రకటించింది. ప్రస్తుతం శివసేన షిండే వర్గం నేతగా ఉన్న రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా ఉన్న ఉదయ్ సమంత్ సోదరుడు కిరణ్ సమంత్ ఈ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించాడు. దీంతో సీఎం షిండే సైతం ఈ సీటుపై పట్టుబట్టాడు. ఈ విషయమై బీజేపీతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాకముందే బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించడంతో షిండేకు గట్టి షాక్ తగిలినట్టు అయింది. ఈ నిర్ణయంతో సమంత్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో రాణేకు మద్దతు ఉంటుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రాణే మాట్లాడుతూ..తాను ఎంపీ అయ్యాక ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కాగా, ప్రస్తుతం రత్నగిరి సింధ్ స్థానంలో శివసేన(యూబీటీ) నేత వినాయక్ రౌత్ ఎంపీగా ఉన్నారు. ఆయనకే మరోసారి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు.