Sharad pawar: సీఎం షిండేతో శరద్ పవార్ భేటీ..అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం

by vinod kumar |
Sharad pawar: సీఎం షిండేతో శరద్ పవార్ భేటీ..అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల వేళ మహారాష్ట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ శనివారం సీఎం ఏక్ నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ముంబైలోని సీఎం అధికారిక నివాసంలో షిండేను కలిశారు. అయితే వీరిద్దరూ ఎందుకోసం సమావేశమయ్యారనే వివరాలు వెల్లడి కాలేదు. కానీ మరాఠా రిజర్వేషన్లు, తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్టు తెలుస్తోంది. మరాఠాలు, ఓబీసీ కమ్యునిటీ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంశంపైనే చర్చించినట్టు సమాచారం. కాగా, 15 రోజుల వ్యవధిలోనే షిండే, శరద్ పవార్‌ల మధ్య భేటీ జరగడం ఇది రెండోసారి. జూలై 23న ఇద్దరూ సమావేశమయ్యారు. దీంతో తాజాగా మరోసారి కలవడం ఆసక్తి నెలకొంది. అంతకుముందు సీఎం షిండేతో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే భేటీ అయ్యారు. ముంబైలోని బీడీడీ చాల్స్‌ రీడెవలప్‌మెంట్‌, పోలీస్‌ కాలనీల పునరాభివృద్ధి, ఇళ్ల లభ్యత వంటి పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు.

Next Story

Most Viewed