Madras Highcourt: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మంత్రులకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు

by S Gopi |
Madras Highcourt: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మంత్రులకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఇద్దరు తమిళనాడు మంత్రులకు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. వారు వేసిన డిశ్చార్జి పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు పక్కన పెట్టి, వారిపై అభియోగాలు మోపాలని దిగువ కోర్టును ఆదేశించింది. అంతేకాకుండా దిగువ కోర్టు రోజువారీగా విచారణ జరపాలని కూడా స్పష్టం చేసింది. అన్నాడీఎంకే హయాంలో 2011, 2012లో సీనియర్ డీఎంకే నేతలైన ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, రెవెన్యూ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌లపై కేసులు నమోదయ్యాయి. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ దాఖలు చేసిన అదనపు నివేదికల ఆధారంగా ప్రత్యేక కోర్టు వారిని విడుదల చేసింది. జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఈ కేసును స్వయంగా స్వీకరించి డిశ్చార్జి ఉత్తర్వులను పక్కన పెట్టారు. దాంతో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఇద్దరు మంత్రులు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. త్వరితగతిన విచారణ జరగాలని హైకోర్టు నొక్కి చెప్పడంతో ట్రయల్ కోర్టు విచారణను వేగవంతం చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed