బిహార్ రాజకీయాల్లో BIG ట్విస్ట్.. ఆట ముగియలేదని బీజేపీ సంచలన రియాక్షన్

by GSrikanth |
బిహార్ రాజకీయాల్లో BIG ట్విస్ట్.. ఆట ముగియలేదని బీజేపీ సంచలన రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అనూహ్యంగా సీఎం పదవి కోసం బీజేపీ డిమాండ్ చేస్తోంది. శనివారం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి మీడియాతో మాట్లాడారు. బిహార్‌లో ఇంకా ఆట ముగియలేదని చెప్పారు. మా వ్యూహం మాకు ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. జరగాల్సిన దానిపై తాము దృష్టి పెట్టామని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ‘ఇంకా సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయలేదు. ప్రభుత్వానికి ఆర్జేడీ మద్దతును ఉపసంహరించుకోలేదు.’ ఇదంతా జరగడానికి ముందే తమకు సీఎం పదవి కావాలని బీజేపీ డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. కాగా, బిహార్ రాజకీయాలు సీఎం నితీష్ కుమార్ చుట్టే తిరుగుతున్నాయి.

ఆయన తన పదవికి రాజీనామా చేసి.. జేడీయూ, బీజేపీ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ఊహాగానాల నడుమ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమిత్ షాతో జేపీ నడ్డా, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సహా పలువురు కీలక నేతలు సమావేశం అయ్యారు. ఇందులో జేడీయూతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, తమతో వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో బిహార్ బీజేపీ చీఫ్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

Advertisement

Next Story