మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు

by Gantepaka Srikanth |
మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)‌లో గరియాబాద్ ఎన్‌కౌంటర్(Encounter) తర్వాత అడవుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. అడవులను జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులను అమర్చిన బాంబులను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నాయి. తాజాగా.. గురువారం బీజాపూర్‌లో ఓ బాంబును గుర్తించి పేల్చివేశారు. భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు అడవుల్లోని పలు ప్రాంతాల్లో మందుపాతరలను పాతిపెడతారని పోలీసులు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం భద్రతా బలగాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందుపాతరలు అమర్చడంతో ఏడుగురు జవాన్లు, ఒక డ్రైవర్ మరణించారు. అప్పటినుంచి కూంబింగ్(Police Combing)ముమ్మరం చేశారు.

అంతేకాదు.. మావోయిస్టు(Maoists)ల స్థావరాలను సైతం భద్రతా బలగాలు ధ్వంసం చేస్తున్నాయి. బీజాపూర్ అడవుల్లో శిక్షణా శిబిరాలను గుర్తించారు. స్మారక స్థూపాలు, శాశ్వత గుడిసెలను వేశారు. ముఖ్యంగా మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా రాష్ట్రాల్లో అడవులను భద్రతా బలగాలు అణువణువునా గాలిస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అగ్రనేతలతో సహా పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందారు.



Next Story

Most Viewed