బిల్డర్-కొనుగోలుదారుల ఒప్పందాలలో ఏకీకృత విధానం అవసరం: సుప్రీంకోర్టు

by S Gopi |
బిల్డర్-కొనుగోలుదారుల ఒప్పందాలలో ఏకీకృత విధానం అవసరం: సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా స్థిరాస్తి కొనుగోలులో బిల్డర్ల మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్డర్ల దోపిడి నుంచి కొనుగోలుదారులను రక్షించడానికి దేశవ్యాప్తంగా బిల్డర్-కొనుగోలుదారు ఒప్పందాలలో ఏకీకృత నమూనా అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. 2020లో న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 'బిల్డర్లు కొనుగోలుదారులపై విధించే నిబంధనల విషయంలో కొంత ఏకీకృత నమూనా ఉండాలి. లేదంటే దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు బిల్డర్ల చేతిలో మోసపోతారని' భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను కలుపుకొని ఫైనల్ స్టేటస్ రిపోర్ట్, బిల్డర్-కొనుగోలుదారు ఒప్పంద ముసాయిదాలను సమర్పించినట్టు బెంచ్‌కు అడ్వైజరీగా ఉన్న సీనియర్ న్యాయవాది దేవాశిష్ భారుకా కోర్టుకు తెలియజేశారు. ఆయన నివేదికను సమీక్షించిన సుప్రీంకోర్టు క్రెడాయ్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ అంశంపై జూలై 18న తదుపరి విచారించనున్నట్టు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed