CAG Sanjay Murthy : కాగ్ జనరల్‌గా తొలి తెలుగు వ్యక్తి సంజయ్‌మూర్తి ప్రమాణస్వీకారం

by Ramesh N |   ( Updated:2024-11-21 06:53:58.0  )
CAG Sanjay Murthy : కాగ్ జనరల్‌గా తొలి తెలుగు వ్యక్తి సంజయ్‌మూర్తి ప్రమాణస్వీకారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ (Comptroller and Auditor General of India) (CAG) జనరల్‌గా తెలుగు అధికారి కొండ్రు సంజయ్‌మూర్తి (Sanjay Murthy) బాధ్యతలు చేపట్టారు. ఆయన కాగ్ అధిపతిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి ఘనత సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు సంజయ్ మూర్తి. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ కేడర్‌కు ఎంపికయ్యారు. తర్వాత కేంద్ర సర్వీసుల్లో చురుకుగా పనిచేశారు.

2021లో జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమలులో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఐఏఎస్ అధికారిగా చేరిన ఆయన ఉద్యోగ విరమణ సమీపిస్తున్న తరుణంలో కేంద్రం కాగ్ జనరల్‌గా కీలక పదవిని అప్పగించింది. కాగ్ పదవి గరిష్టంగా ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వరకు కొనసాగే అవకాశం కలిగి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed