Landslides: సిమ్లాలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. 20 మృతదేహాల వెలికితీత

by Harish |
Landslides: సిమ్లాలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. 20 మృతదేహాల వెలికితీత
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడగా చాలా మంది మరణించారు. తాజాగా వర్షాలు కొంత వరకు తగ్గుముఖం పట్టాయి. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతుంది. జిల్లా యంత్రాంగం శిథిలాల నుంచి 20 మృతదేహాలను వెలికితీశారు. రోడ్లు చాలా వరకు దెబ్బతినడంతో వాటి పునరుద్ధరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమేజ్ ప్రాంతాల్లో రాంపూర్ వరదలో 33 మృతదేహాలలో 20 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భారీగా కురిసిన వర్షాల ధాటికి నదుల్లో నీటి మట్టం పెరిగింది. గల్లంతైన కొన్ని మృతదేహాలు సట్లెజ్ నదిలో తేలియాడుతూ కనిపించాయి.

కొండచరియలు విరిగిపడడం వల్ల బోయిలౌగంజ్, చౌరా మైదాన్, ఎమ్మెల్యే క్రాసింగ్‌లను కలిపే రహదారి ఎక్కువగా ప్రభావితమైంది. ప్రస్తుతం ఈ రూట్‌లో వాహనాలను దారి మల్లించారు. ట్రాఫిక్ నిర్వహణకు అదనపు పోలీసు సిబ్బందిని నియమిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. దెబ్బతిన్న రహదారులను తిరిగి పునరుద్ధరించడానికి ఇంజనీరింగ్ సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారు. మరోవైపు ధ్వంసమైన రోడ్లపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొండచరియలు విరిగిపడటానికి స్థానిక అధికారుల నిర్లక్ష్యం కారణమని ఆరోపించారు. మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో నీరు, మురుగు నీటి సరఫరా సమస్యల గురించి ఆందోళన చేశారు. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను కోరారు.

Advertisement

Next Story