- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆస్పత్రి నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ డిశ్చార్జ్
by Hajipasha |

X
దిశ, నేషనల్ బ్యూరో : వెన్నునొప్పితో బాధపడుతూ గురువారం రోజు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని లఖ్నవూ నుంచి లోక్‌సభకు పోటీచేసి రాజ్‌నాథ్ గెలిచారు. ఆయన 13 ఏళ్ల వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి 1977లో ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంతో ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. 1975లో ఎమర్జెన్సీ టైంలో రాజ్ నాథ్ సింగ్ జైలుకు కూడా వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Next Story