Heavy rains: మరో 28 రైళ్లను క్యాన్సిల్ చేసిన దక్షిణ మధ్య రైల్వే

by Anjali |   ( Updated:2024-09-03 07:26:13.0  )
Heavy rains: మరో 28 రైళ్లను క్యాన్సిల్ చేసిన దక్షిణ మధ్య రైల్వే
X

హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ఇప్పటికే దక్షిణ రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా మరో 28 ట్రైన్లను రద్దు చేసినట్లు తెలిపింది. కాగా ఈ నెల(సెప్టెంబరు) 4, 5, 7 తేదీల వరకు పలు రైళ్లు క్యాన్సిల్ అయినట్లు వెల్లడించింది. దీంతో ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని దక్షిణ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే భారీ వరదతో మహబూబాబాద్ లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రాక్ మరమత్తు పనులు కొనసాగుతున్నాయి. రెండ్రోజుల్లో ట్రాక్ పనులు పూర్తి అవుతాయని, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ గుండా ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇక వర్షాల కారణంగా సోమవారం వరకు 496 రైళ్లు రద్దు చేశారు. 152 సర్వీసులను దారి మళ్లించారు.

Advertisement

Next Story

Most Viewed