Rain Affect: చెన్నై సిటీలో అతి భారీ వర్షాలు.. మొత్తం 31 విమానాలు క్యాన్సిల్

by Shiva |
Rain Affect: చెన్నై సిటీలో అతి భారీ వర్షాలు.. మొత్తం 31 విమానాలు క్యాన్సిల్
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి ప్రభావంతో చెన్నై సిటీలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని లొతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఇళ్లలోంచి జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అదేవిధంగా వాతావరణం అనుకూలించపోవడంతో చెన్నై ఎయిర్‌పోర్టులో పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మొత్తం 15 విమానాలు చెన్నైలో ఎయిర్ పోర్టులో ల్యాండ్‌ అయ్యేందుకు సిద్ధం కాగా, అందులో నాలుగు ఫ్లైట్లను అధికారులు బెంగళూరు తిప్పి పంపారు. మొత్తంగా చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి 31 విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని ఎయిర్‌‌పోర్టు వర్గాలు తెలిపాయి. అకస్మాత్తుగా విమానాలు అన్ని రద్దు అవ్వడంతో ప్రయాణికులు నానా తిప్పలు పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed