Railway Strike : దేశవ్యాప్తంగా పట్టా లెక్కని రైళ్లు.. ప్రయాణికుల అవస్థలు

by M.Rajitha |
Railway Strike : దేశవ్యాప్తంగా పట్టా లెక్కని రైళ్లు.. ప్రయాణికుల అవస్థలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఒక్కసారిగా దేశవ్యాప్తంగా రైళ్లు పట్టాలెక్కక పోవడంతో.. రైళ్ల కోసం గంటలు గంటలు ఎదురు చూసిన వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థల పాలయ్యారు. అయితే ఇది మన పొరుగు దేశం అయినా బంగ్లాదేశ్(Bangladesh) లో జరిగిన సంగతి. వివరాల్లోకి వెళితే.. మంగళవారం 'బంగ్లాదేశ్ రైల్వే రన్నింగ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్' సమ్మె( Railway Strike)కు దిగిన నేపథ్యంలో రైల్వే సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైల్వే ఉద్యోగులకు పింఛన్లు పెంచడం సహా ఇతర ప్రయోజనాలను కల్పించాలని రైల్వే కార్మిక యూనియన్ డిమాండ్ చేసింది. డిమాండ్లపై చర్చించేందుకు సోమవారం బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్ యూనుస్‌(Mohemmad Yunas)తో భేటీ అయినప్పటికీ.. అవేవీ సత్ఫలితాలను ఇవ్వలేదు.ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి రైల్వే యూనియన్ సమ్మె దిగింది. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకుంటే రైల్వే సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తామని తెలియ జేశారు.

ప్రయాణికుల ఇక్కట్లు

సమ్మె గురించి తెలియకపోవడం వల్ల బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని కమ్లాపుర్ రైల్వే స్టేషన్‌కు పెద్దసంఖ్యలో ప్రయాణికులు తరలివచ్చారు. రైల్వే సమ్మె అని తెలిశాక, చాలామంది ఇళ్లకు వెనుదిరిగారు. ఇంకొందరు దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదులు ఇచ్చారు. మంగళవారం ఉదయం ఢాకా నగరం నుంచి 10 రైళ్లు వివిధ చోట్లకు బయలుదేరాల్సిన రైళ్లు అకస్మాత్తుగా రద్దు కావడం వల్ల ప్రయాణికులను బస్సుల్లో వారి గమ్యస్థానాలకు పంపించినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.

వస్త్ర ఎగుమతులకు బ్రేక్

బంగ్లాదేశ్‌లోని రెండో అతిపెద్ద నగరం ఛటోగ్రామ్‌లోనూ రైల్వే ఉద్యోగులు నిరసనకు దిగారు. ఈ నగరంలో అతిపెద్ద ఓడరేవు కూడా ఉంది. ఛటోగ్రామ్‌కు రైళ్లలో వస్త్ర ఉత్పత్తులు చేరుతుంటాయి. వాటిని ఇక్కడి ఓడరేవులోని నౌకల ద్వారా అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ ఎగుమతుల ద్వారా ఏటా రూ.3 లక్షల కోట్లను ఆర్జిస్తుంటుంది. దీంతో భారీ ఎత్తున వస్త్ర ఉత్పత్తుల ఎగుమతి నిలిచిపోయింది.

బంగ్లాదేశ్ జనాభా దాదాపు 17 కోట్లు. ఇక్కడి రైల్వే వ్యవస్థ ఏటా దాదాపు 6.5 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. దేశంలో దాదాపు 25వేల మంది రైల్వే సిబ్బంది ఉన్నారు. 36 వేల కి.మీ పరిధిలో బంగ్లాదేశ్ రైల్వే నెట్‌వర్క్ విస్తరించి ఉంది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా వెళ్లిపోయినప్పటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. వ్యాపార, వాణిజ్యాలు బలహీనపడ్డాయి. వాటిని గాడిన పెట్టాలంటూ ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed