రాహుల్ గాంధీ ఆస్తి రూ.20కోట్లు..వ్యవసాయ భూమి : అఫిడవిట్‌లో కీలక విషయాలు వెల్లడి

by samatah |   ( Updated:2024-04-04 05:59:07.0  )
రాహుల్ గాంధీ ఆస్తి రూ.20కోట్లు..వ్యవసాయ భూమి : అఫిడవిట్‌లో కీలక విషయాలు వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నామినేషనల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అందజేసిన అఫిడవిట్‌లో కీలక విషయాలను వెల్లడించారు. తనకు రూ.20కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. అయితే సొంత వాహనం, ఇళ్లు లేదని పేర్కొన్నారు. అంతేగాక రూ.55వేల నగదు, రూ.26.25లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ.4.33కోట్ల బాండ్లు, షేర్లు రూ.3.81కోట్లు, రూ. 15.21లక్షల గోల్డ్ బాండ్లు, రూ. 4.20లక్షల విలువైన బంగారు అభరణాలు ఉన్నట్టు తెలిపారు.

అంతేగాక రూ.11.15 కోట్ల స్థిరాస్తులను కలిగి ఉన్నట్టు వెల్లడించారు. ఢిల్లీలోని మెహ్రౌలీలో ఆయన సోదరి ప్రియాంక గాంధీతో కలిపి వ్యవసాయ భూమి ఉంది. ఇది వారసత్తంగా వచ్చినట్టు రాహుల్ పేర్కొన్నారు. గురుగ్రామ్‌లో ఆఫీస్ స్పేస్‌ని కలిగి ఉండగా..దాని విలువ సుమారు రూ.9కోట్లు ఉంటుంది. అలాగే తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను కూడా రాహుల్ వెల్లడించారు. దీనిలో బీజేపీ నేతల పరువు నష్టం ఫిర్యాదులపై దాఖలైన కేసులు సహా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌తో ముడిపడి ఉన్న క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల గుర్తింపును సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించినందుకు గాను పోక్సో చట్టం కింద కూడా కేసు ఉంది.

Advertisement

Next Story