- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కిసాన్ కి బాత్.. రైతులతో రాహుల్ మాట ముచ్చట
by Ramesh N |

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఆయన బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీహార్‌లోని పూర్నియా రైతులతో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. రైతులు మన దేశానికి వెన్నెముక అని, అయితే గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం వారికి అన్యాయం, దౌర్జన్యాలు మాత్రమే చేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలోని అన్నదాతలకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని, కచ్చితంగా లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, రాహుల్ గాంధీ తలపాగా ధరించి రైతులతో కలిసి ముచ్చటించారు. వారితో కలిసి కొద్ది సేపు పనిచేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
Next Story