- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Rahul Gandhi: గుజరాత్, ఢిల్లీ ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఎమోషనల్ ట్వీట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టీఆర్పీ గేమింగ్ జోన్‌లో మంటలు చెలరేగి 27 మంది చనిపోయారు. అదేవిధగా శనివారం అర్ధరాత్రి ఢిల్లీలోని వివేక్ విహార్ న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రెండు ఘటనపై ట్వీట్ చేశాడు. ‘గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ఓ గేమింగ్ జోన్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో అమాయక చిన్నారులు సహా పలువురు మరణించిన వార్త చాలా బాధాకరం. అదేవిధంగా ఢిల్లీలోని ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మరణించడం నన్ను కలచి వేసింది. మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. సహాయ కార్యక్రమాల్లో అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలను అభ్యర్థిస్తున్నాను. గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలు ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తును నిర్వహించి భాధ్యులపై చర్యలు తీసుకోవాలి, మృతుల కుటుంబాలందరికీ సత్వర న్యాయం అందించాలని కోరుతున్నా’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.