Priyanka Gandhi: ప్రియాంక అఖండ విజయం.. ఎంత మెజార్టీతో గెలిచారో తెలుసా?

by Mahesh Kanagandla |
Priyanka Gandhi: ప్రియాంక అఖండ విజయం.. ఎంత మెజార్టీతో గెలిచారో తెలుసా?
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్(Congress) అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) విజయవంతంగా ఎన్నికల రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. వయనాడ్(Wayanad Result) నుంచి తొలిసారి పోటీ చేసి అఖండ విజయాన్ని కైవసం చేసుకున్నారు. నవంబర్ 13న జరిగిన వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేసిన ప్రియాంక, 4.10 లక్షల(4,10,931) ఓట్ల మార్జిన్‌తో రికార్డ్ విజయాన్ని నమోదు చేశారు. తన సోదరుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో సాధించిన మార్జిన్ కంటే కూడా ఎక్కువ ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో విజయఢంకా మోగించారు. రాయ్‌బరేలీ నుంచీ గెలిచిన ఆయన వయనాడ్‌కు రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. 2019లో రాహుల్ ఇదే స్థానంలో 4.31 లక్షల ఓట్ల మార్జిన్‌ను సొంతం చేసుకున్నారు. తాజాగా, జరిగిన ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ వాద్రా 6,22,338 ఓట్లు సాధించారు. సమీప అభ్యర్థిగా సీపీఐ నేత సంత్యన్ మొకేరి(2,11,407) పై గెలిచారు. ఈ ఫలితంపై ప్రియాంక స్పందిస్తూ.. ‘నాపై మీరు పెట్టుకున్న నమ్మకానికి సంతోషిస్తున్నాను. ఈ విజయం మీదేనని, మీ ఆశయాలను అర్థం చేసుకునే ప్రతినిధిని ఎన్నుకున్నారని నిరూపిస్తాను. మీ కోసం మీలో ఒకరిగా పోరాడుతాను. పార్లమెంటులో మీ గళాన్ని వినిపించడానికి ఎదురుచూస్తున్నాను. మీరు కురిపించిన ప్రేమకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. దారి చూపించి వెన్నంటే ఉన్నందుకు సోదరుడు రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపారు. వయనాడ్‌ను పురోగతి వైపు ప్రియాంక తప్పకుండా తీసుకెళ్లుతారని, ఆమెపై నమ్మకముంచినందుకు ధన్యవాదాలని రాహుల్ స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed