మోడీ ఏమైనా జ్యోతిష్యులా? ప్రధాని వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ స్ట్రాంగ్ కౌంటర్

by S Gopi |
మోడీ ఏమైనా జ్యోతిష్యులా? ప్రధాని వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోడీ ఏమైనా జ్యోతిష్యులా? అని ప్రశ్నించారు. అంతకుముందు ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము లోక్‌సభ ఎన్నికల్లో 400 కంటే ఎక్కువ స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెద్దగా ఆదరణ లేదని, ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ కనుమరుగవుతుందని మోడీ విమర్శలు చేశారు. దీనికి బదులిచ్చిన ప్రియాంక గాంధీ.. ఏ పార్టీ ఏం చేసిందో ప్రజలు అర్థం చేసుకుంటారు. మొదట బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ ఏం చేసిందో చూడండి. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలోని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో అర్థం చేసుకోవాలి. ఈ అంశాలను సరిచూసి ఓటు వేయాలని ప్రజలనుద్దేశించి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడే వారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాంగ్రెస్ కంచుకోటలైన అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాల్లో రాహుల్ గాంధీ, కిషోరి లాల్ భారీ మెజారిటీతో గెలవనున్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఇటీవలి అమేథీ పర్యటన పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమేనని ప్రియాంక గాంధీ విమర్శించారు.

Advertisement

Next Story