PM Modi: ఆ రాష్ట్రంలో సీఎం కూడా జీతం తీసుకోలేని పరిస్థితి.. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

by Mahesh |
PM Modi: ఆ రాష్ట్రంలో సీఎం కూడా జీతం తీసుకోలేని పరిస్థితి.. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా(Haryana) ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ(Prime Minister Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పడింది. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దివాలా తీసేలా చేసింది. దీంతో హిమాచల్ పౌరులెవరూ ఈరోజు సంతోషంగా లేరు..అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం కాంగ్రెస్ ప్రతి వర్గానికి అబద్ధాలు చెప్పింది. ఎన్నికల అనంతరం.. అక్కడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేరలేదు. వారి జీతం కోసం అక్కడ సమ్మె చేయవలసి వచ్చింది. అక్కడ మహిళలకు 1500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ నెరవేర్చలేదు. దీంతో హిమాచల్‌లో ఇప్పటికీ వేలాది మంది మహిళలు రూ. 1500 కోసం వేచి ఉన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్తమైన పాలనతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కరెంటు, నీళ్లు, పెట్రోల్, డీజిల్, పాలు, అన్నీ ఖరీదైనవిగా మారిపోయాయి. దేశంలో కాంగ్రెస్‌ను మించిన మోసపూరితమైన పార్టీ మరొకటి లేదు. ప్రస్తుతం ఆ రాష్ట్ర సీఎం కూడా జీతం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా కాంగ్రెస్ చెడగొట్టింది. కాబట్టి.. హర్యానా రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లాంటి పరిస్థితి తీసుకురావద్దని.. హర్యానా ప్రజలకు ప్రధాని మోడీ(Prime Minister Modi) పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed