- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒరిస్సాలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ను ప్రారంభించిన పీఎం మోడీ

దిశ, వెబ్ డెస్క్: ఒరిస్సాలో మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఒరిస్సాలోని పూరి నుంచి బెంగాల్ లోని హౌరా వరకు ఈ ట్రైన్ నడవనుంది. ఇక రూ.8,200 కోట్ల విలువైన రైల్వే పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మొత్తం 15 వందే భారత్ రైళ్లు ప్రారంభించామని తెలిపారు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో వందే భారత్ రైళ్లను రూపొందించినట్లు తెలిపారు.
ఇక వందే భారత్ రైళ్ల ద్వారా సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు.. వివిధ రాష్ట్రాల మధ్య మత, సాంస్కృతిక సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్త చేశారు. ప్రస్తుతం అమృతకాలంలో ఉన్నామన్న పీఎం.. సమైక్యంగా ఉండి ప్రపంచానికి మన సత్తా ఏంటో చాటాలని పిలుపునిచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు పూరి స్టేషన్ వద్ద ఉన్నారు.