- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్‌కు ప్రిడేటర్ డ్రోన్ విక్రయం: యూఎస్ కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్
దిశ, నేషనల్ బ్యూరో: దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌కు ప్రిడేటర్ డ్రోన్ ‘ఎంక్యూ9బీ’ విక్రయించేందుకు యూఎస్ కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీనిపై 24గంటల్లో స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు యూఎస్ అధికారులు ప్రిడేటర్ డ్రోన్ తయారీ కంపెనీ అయిన జనరల్ అటామిక్స్‌కు ఈ విషయాన్ని తెలియజేసినట్టు సమాచారం. అయితే దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. కానీ డ్రోన్ విక్రయానికి దాదాపు ఆమోదం లభించినట్టు తెలుస్తోంది. దీని ద్వారా భారత్‌కు అమెరికా 31 డ్రోన్‌లను అందించనుంది. అందులో ఇండియన్ నేవీకి 15, ఆర్మీకి 8, ఎయిర్ ఫోర్సుకు 8 డ్రోన్లు లభించనున్నాయి. ‘గత శతాబ్దంలో యూఎస్-భారత్ భాగస్వామ్యం గణనీయమైన వృద్ధిని సాధించింది. గతేడాది మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య డ్రోన్ ఒప్పందం కుదిరింది. భారతదేశంతో వ్యూహాత్మక సాంకేతిక సహకారాన్ని , సైనిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. డ్రోన్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ ఒప్పందాలు రెండూ భారత్, యూఎస్ జాతీయ భద్రతా సలహాదారులు నిర్వహిస్తున్నారు.
ఇండియన్ నేవీ వద్ద రెండు యూఎస్ డ్రోన్లు
భారత నావికాదళం ఇప్పటికే రెండు నిరాయుధ ప్రిడేటర్ డ్రోన్‌లను తమిళనాడులోని రాజాలి ఎయిర్ బేస్ నుంచి నడుపుతోంది. అవి అమెరికా నుంచి లీజుకు తీసుకున్నవే. ప్రస్తుం ఎర్ర సముద్రంలో నిఘాకు వీటిని ఉపయోగిస్తున్నట్టు సమాచారం. కాగా, ఎంక్యూ 9 ప్రిడేటర్ డ్రోన్ అనేది మానవ రహిత వైమానిక విమానం. స్వయం ప్రతిపత్త విమాన కార్యకలాపాలను నిర్వహించగలిగే సామర్థ్యం దీనికి ఉంటుంది. దీనిని జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ తయారు చేస్తుంది. ఇవి భారత్‌కు వస్తే నిఘా కార్యకలాపాలు మరింత మెరుగవుతాయని సాయుధ దళాల అధికారులు భావిస్తున్నారు.