తమిళనాడు మంత్రి పిటిషన్ ను కొట్టేసిన కోర్టు

by Javid Pasha |
తమిళనాడు మంత్రి పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
X

చెన్నై: మనీలాండరింగ్ కేసులో తనకు విధించిన 15 రోజుల (జూన్ 28 వరకు) జ్యుడీషియల్ రిమాండ్‌ను తిరస్కరించాలని కోరుతూ తమిళనాడు మంత్రి వి.సెంథిల్ బాలాజీ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు గురువారం కొట్టేసింది. ఈ కేసులో పోలీసు కస్టడీకి బాలాజీని అప్పగించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి ఇంకా వాదనలు వినాల్సి ఉంది. మరోవైపు మంత్రి వి.సెంథిల్ బాలాజీ ఇప్పటివరకు నిర్వహించిన 2 శాఖలను ఇద్దరు మంత్రులకు స్టాలిన్ చెరొకటి కేటాయించారు.

తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసుకు ఇంధన శాఖ అదనపు బాధ్యతలు అప్పగించగా.. గృహనిర్మాణ శాఖ మంత్రి ఎస్.ముత్తుసామికి ఎక్సైజ్ శాఖను కూడా కేటాయించారు. బుధవారం తెల్లవారుజామున ఈడీ కస్టడీలో ఉండగా మంత్రి బాలాజీకి ఛాతీనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు చెన్నైలోని ఒమందూరర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనరీ యాంజియోగ్రామ్ నిర్వహించారు.


Advertisement

Next Story

Most Viewed