- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆధార్ అథెంటికేషన్ కోసం కొత్త పోర్టల్

- ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇవ్వడానికే..
- వేరే యాప్స్‌లోనూ ఫేస్ ఐడెంటిటీ అథెంటికేషన్
దిశ, నేషనల్ బ్యూరో: ఆధార్ అథెంటికేషన్‌ను మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త వెబ్ పోర్టల్‌ను రూపొందించింది. ఆధార్‌ను ఉపయోగించి వినియోగదారుడి సమాచారాన్ని నిర్ధారించుకోవడానికి ఇకపై ప్రైవేటు సంస్థలకు కూడా అనుమతి ఇవ్వనుంది. ఇందు కోసం జనవరి 31న సవరించిన గుడ్ గవర్నెన్స్ నిబంధనల మేరకు కేంద్ర ఎలక్ట్రినిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) వెబ్ పోర్టల్‌ను గురువారం ప్రారంభించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 275 శాఖలను ఐటీ శాఖ గుర్తించింది. ఆగస్టు 2020 నుంచే ఆయా ప్రభుత్వ శాఖలు ఆధార్ బేస్డ్ అథెంటికేషన్‌ను నిర్వహించడానికి అనుమతి పొంది ఉన్నాయి. అయితే ఇకపై ప్రైవేటు సంస్థలు కూడా ఇలాంటి అనుమతులు పొందడానికి కేంద్రం వీలు కల్పించింది.
తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం ఆధార్ కలిగి ఉన్న వినియోగదారుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు ప్రైవేటు సంస్థల సేవలను పొందవచ్చు. హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, క్రెడిట్ రేటింగ్ బ్యూరో, ఈ-కామర్స్ సంస్థలు, విద్యా సంస్థలు, అగ్రిగేట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అవాంతరాలు లేని సేవలను పొందే వీలుంటుంది. కేంద్రం అనుమతి పొందిన సంస్థలు తమ స్టాఫ్ అటెండెన్స్, ఈ-కేవైసీ, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ వంటి సేవల కోసం ఆధార్ అథెంటికేషన్ ఉపయోగించుకోవచ్చు. ఇక సవరించిన నిబంధనల్లో ప్రైవేటు సంస్థలు ఎలా ఆధార్ అథెంటికేషన్‌ను పొందవచ్చో కూడా వివరించారు. ప్రైవేటు సంస్థలు సంబంధిత మంత్రిత్వ శాఖకు లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆన్‌లైన్ ప్రతిపాదనను పంపాలి. ప్రైవేటు సంస్థలు పంపించిన ప్రతిపాదనలతో సంబంధిత రాష్ట్ర శాఖ సంతృప్తి చెందితే.. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. కేంద్ర ప్రభుత్వం ఆధార్ సంస్థ (యూఐడీఐఏ)కు సదరు ప్రదిపాదనను పంపి.. తగిన సూచన చేయాలని కోరుతుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ఆధార్ అథెంటికేషన్ ప్రతిపాదనను యూఐడీఐఏ క్షుణ్ణంగా పరిశీలించి.. తన సిఫార్సును కేంద్ర ఐటీ శాఖకు చెప్తుంది. ఆ తర్వాత సంబంధిత మంత్రిత్వ శాఖ సదరు ప్రైవేటు సంస్థ ఆధార్ అథెంటికేషన్‌ను ఉపయోగించడానికి అనుమతి ఇస్తుంది. ఒక సారి ఆధార్ నుంచి అనుమతులు పొందిన తర్వాత.. వినియోగదారుడికి సంబంధించిన నిర్ధారణలు చేసుకోవడానికి సదరు సంస్థకు అధికారం వస్తుంది. ఇలా అనుమతులు పొందిన సంస్థలు.. తమ యాప్స్‌లో ఆధార్ అథెంటికేషన్ చేసుకునే వీలుంటుంది.