- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Breaking: తక్షణమే అమల్లోకి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ .. నింబంధనలు ఇవే..!

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్(SC Classification Ordinance) అమలు నిబంధనలు జారీ అయ్యాయి. మూడు గ్రూపులలో ఎస్సీ కులాల విభజన జరిగిన విషయం తెలిసిందే. అయితే రిజర్వేషన్లు(Reservations) నిర్వచిస్తూ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం గెజిట్ జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా రిజర్వేషన్ నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నిబంధనలను తక్షణమే అమల్లోకి తీసుకొచ్చింది. మొదటి గ్రూపులో రెల్లి సహా 12 ఉప కుమాలకు 1 శాతం, రెండో గ్రూపులో మాదిగ సహా 18 ఉపకులాలకు 6.5 శాతం, మూడో గ్రూపులో మాల సహా 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ కల్పించింది. ఎస్సీ వర్గీకరణ కింద 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిబంధనలను ప్రభుత్వం జారీ చేసింది. మొత్తం 200 రోస్టర్ పాయింట్ల అమలు చేయాలని నిర్ణయించింది. మూడు కేటగిరిల్లోనూ మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అర్హులు లేకపోతే తదుపరి నోటిఫికేషన్‌కు ఖాళీలు బదలాయిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.