- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi : ప్రధాని మోడీ పాదాలను తాకిన సీఎం నితీశ్
దిశ, నేషనల్ బ్యూరో : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్(Nitish Kumar) మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. బుధవారం బిహార్‌లోని దర్భంగాలో ఉప ఎన్నికల ప్రచార ర్యాలీ జరిగింది. ఈసందర్భంగా సభా వేదికపై ప్రధాని మోడీ కూర్చొని ఉన్న వైపు సీఎం నితీశ్ నడుచుకుంటూ వెళ్లారు. నితీశ్‌ను గమనించిన ప్రధాని మోడీ.. తన పక్కనున్న కుర్చీలో కూర్చొమ్మని చేతితో సైగ చేశారు.
నితీశ్ నేరుగా వెళ్లి సీటులో కూర్చుంటారని మోడీ భావించారు. అయితే నితీశ్ వెళ్లి ప్రధానమంత్రి పాదాలను తాకే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే నిలబడిన మోడీ.. తన పాదాలను తాకొద్దంటూ నితీశ్ చేతులను పట్టుకున్నారు. సీటులో కూర్చోండి అని సూచించారు. దీంతో మోడీ పక్కనే తనకు కేటాయించిన కుర్చీలో సీఎం నితీశ్ కూర్చున్నారు. ఈ ఏడాది జూన్‌లో పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో, ఏప్రిల్‌లో బిహార్‌లోని నవాడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలోనూ ఇదే విధంగా ప్రధాని మోడీ పాదాలను తాకేందుకు సీఎం నితీశ్ యత్నించారు.