ఈశాన్య రాష్ట్రానికి తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్

by Harish |   ( Updated:2023-05-29 17:09:58.0  )
ఈశాన్య రాష్ట్రానికి తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
X

గౌహతి: ఈశాన్య రాష్ట్రాల్లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఈ సెమీ హైస్పీడ్ రైలును ప్రధాని మోడీ సోమవారం వర్చువల్ గా ప్రారంభించారు. అస్సాంలోని గౌహతి, పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయిగురి మధ్య 411 కిలోమీటర్ల దూరాన్ని ఐదున్నర గంటల్లో పూర్తి చేస్తుంది. ఇది మంగళవారం మినహా వారంలో 6 రోజులు పని చేస్తుంది. దేశంలో ఇది 18వ వందే భారత్ రైలు.

వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులోని ప్రతి బోగిలోని ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ లో 52 సీటింగ్ కెపాసిటీ, సాధారణ చైర్ కార్లలో 78 సీటింగ్ కెపాసిటీ, డ్రైవింగ్ ట్రైలర్ కోచ్‌ల్లో 44 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ప్రధాని మోడీ ఈ సందర్భంగా న్యూ బొంగైగావ్-దుద్నోయి-మెండిపతేర్ మరియు గౌహతి-చాపర్ముఖ్ రైలు మార్గాల్లో విద్యుదీకరణ విభాగాన్ని కూడా దేశానికి అంకితం చేశారు.

రైళ్ల కోసం లుమ్ డింగ్‌లో కొత్త వర్క్‌షాప్‌ను కూడా ప్రారంభించారు. గతంలో ‘లుక్ ఈస్ట్’ ఉండేదని.. ఇప్పుడు ‘యాక్ట్ ఈస్ట్’ పాలసీ ప్రకారం ప్రభుత్వం పని చేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Advertisement

Next Story