- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కుంభమేళాను విమర్శించిన వారిని ప్రజలు క్షమించరు

- వాళ్లు ఆటవిక నాయకులు
- ఇది షహీద్ తిల్కా మాఝీ భూమి
దిశ, నేషనల్ బ్యూరో: కుంభమేళాకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన వారికి బీహార్ ప్రజలు ఏనాటికీ క్షమించరు. ఆటవికులే మన విశ్వాసాన్ని, వారసత్వాన్ని ద్వేషిస్తారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కుంభమేళాలో నిర్వహణ లోపం, తొక్కిసలాట, అపరిశుభ్రమైన నీటిపై ప్రతిపక్షాలు కొన్నాళ్లుగా తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భాగల్‌పూర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ కుంభమేళా సమయంలో మందరాచల్‌ను సందర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ భూమిలో ఉన్న వారసత్వం, విశ్వాసమే భారత అభివృద్దికి కూడా కారణమని చెప్పారు. ఇది షాహీద్ తిల్కా మాఝి నివసించిన నేల. దీన్ని సిల్క్ సిటీగా కూడా పిలుస్తారు. ఇప్పుడు అందరూ మహాశివరాత్రి పండుగను చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటి పవిత్రమైన సమయంలో ఇక్కడి నుంచే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను దేశంలోని ప్రజలకు పంపించడం అదృష్టంగా భావిస్తున్నానని మోడీ చెప్పారు.
కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాలు కలిసి పని చేస్తన్నాయని, రెండు ప్రభుత్వాలు కూడా అద్భుతమైన భవిష్యత్‌ను నిర్మిస్తున్నాయని ప్రధాని చెప్పారు. జంగిల్ రాజ్‌ను నమ్మే నాయకులు మన వారసత్వం, విశ్వాసానని ద్వేషిస్తారని పరోక్షంగా ఆర్జేడీ నాయకులను ఉద్దేశించి ప్రధాని విమర్శించారు. యూరోప్‌లో ఉన్న జనాభా కంటే ఎక్కువ మంది మహా కుంభమేళాలోపుణ్య స్నానాలు చేశారని ప్రధాని గుర్తు చేశారు. ఇది కుంభమేళా యొక్క ఐక్యతను సూచిస్తుందని చెప్పారు. రామ మందిరం విషయంలో చిరాకు పడిన నాయకులే కుంభమేళాను కూడా విమర్శిస్తున్నారని చెప్పారు. కాగా, గత వారం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుంభమేళాను అర్థం లేని వ్యవహారమని కొట్టిపారేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని మోడీ వారిని ఆటవికులు అని సంభోధించారు.