2023 Manipur violence : 'బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాల వల్లే మణిపూర్ మండుతోంది'

by Vinod kumar |   ( Updated:2023-07-27 13:01:23.0  )
2023 Manipur violence : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాల వల్లే మణిపూర్ మండుతోంది
X

న్యూఢిల్లీ : హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. మణిపూర్‌తో ఎలాంటి సంబంధం లేదని భావిస్తుండటం వల్లే.. ఆ రాష్ట్రం గురించి ప్రధాని మాట్లాడటం లేదని ఆరోపించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాల వల్లే మణిపూర్ మండుతోందని మోడీకి తెలుసని కామెంట్ చేశారు.

‘‘కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి చెప్పే ధైర్యం మీకెప్పుడు (కాంగ్రెస్ నేతలకు) వస్తుంది..? రాహుల్‌ గాంధీ మణిపూర్‌ను ఎలా తగలబెట్టారో చెప్పే దమ్ము మీకుందా..?’’ అని రాజ్యసభలో స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్ ఇచ్చారు. "అధికారం కోసం బీజేపీ ఏమైనా చేస్తుంది. మణిపూర్‌నే కాదు దేశాన్ని కూడా తగలబెడుతుంది. దేశం బాధ గురించి ఆ పార్టీ పట్టించుకోదు" అని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ మాట్లాడిన వీడియోలను కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.


👉 Read Disha Special stories


Next Story