Pm modi: ‘వికసిత్ భారత్’ సాధనకు ప్రజలు ఐక్యం కావాలి.. ప్రధాని మోడీ

by vinod kumar |
Pm modi: ‘వికసిత్ భారత్’ సాధనకు ప్రజలు ఐక్యం కావాలి.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: వికసిత్ భారత్ (vikasit barath) సాధనకు ప్రజలు ఐక్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) పిలుపునిచ్చారు. దేశాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తు్న్న వారి కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ( Subhash Chandra bose) జన్మదినాన్ని పురస్కరించుకుని కటక్‌లో జరిగిన ‘పరాక్రమ్ దివస్’ (Parakram diwas) కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. సుభాష్ చంద్రబోస్ జీవితం ప్రజలకు ఎంతో స్పూర్తినిస్తుందని తెలిపారు. భారతదేశ ఐక్యత కోసం ప్రజలు బోస్ నుంచి ప్రేరణ పొందాలని నొక్కి చెప్పారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా మనల్ని మనం అత్యుత్తమంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. గత దశాబ్దంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, ఆధునిక మౌలిక సదుపాయాలు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. సాయుధ బలగాల బలం కూడా అనూహ్యంగా పెరిగిందన్నారు. ప్రపంచ స్థాయిలో భారత్ బలమైన గొంతుకగా అవతరించిందని కొనియాడారు.

Next Story

Most Viewed