వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్

by Prasad Jukanti |
వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం వారణాసి కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ముందు కాశీలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే క్రూజ్ షిప్ లో పర్యటించారు. కాలభైరవ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. అంతకు ముందు నిన్న యోగితో కలిసి మోడీ భారీ రోడ్‌షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి ఈ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ముఖ్య నేతలతో పాటు ఎన్డీయే నేతలు హాజరయ్యారు.

కాగా, వారణాసి నుంచి మోడీ నామినేషన్ దాఖలు చేయడం ఇది మూడోసారి. 2014లో వడోదర వారణాసిలో పోటీ చేసిన ఆయన రెండు చోట్ల గెలుపొందారు. దాంతో వడోదరలో రాజీనామా చేసి వారణాసి ఎంపీగా కొనసాగారు. 2019లో మరోసారి వారణాసి నుంచే బరిలో నిలిచిన మోడీ ఈ ఎన్నికల్లో 4 లక్షల 79 వేల మెజార్టీతో గెలుపొందారు. వారణాశిలో చివరిదశలో భాగంగా జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనున్నది. ఈసారి మోడీపై కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. మరోవైపు నామినేషన్ సందర్భంగా ఇవాళ ఉదంయ మోడీ ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసుకుని కాశీతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. సాక్షాత్తు ఆ గంగామాతే తనను పిలిచిందని, గంగామాత తనను దత్తత తీసుకుందని, తన కన్నతల్లిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీటియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed