- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్రాంతి వేళ.. ఆవులకు మేత పెట్టిన ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : మకర సంక్రాంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం న్యూఢిల్లీలోని తన నివాసం పంచవటిలో గోవులకు మేత తినిపించారు. సాధారణ దుస్తుల్లో ఉన్న ప్రధాని మోడీ.. గోవులకు ప్రేమగా పచ్చిక తినిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందూ సంప్రదాయాల ప్రకారం.. మకర సంక్రాంతి వంటి శుభ సందర్భాల సమయంలో ఆవులకు మేత పెట్టడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ఇక ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో కళా ప్రదర్శన ఇచ్చిన యువతికి ప్రధాని మోడీ తన శాలువను బహుమతిగా ఇచ్చారు. ఇక పొంగల్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. ఈ పండుగ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ‘‘శనివారం రోజు యావత్ దేశం లోహ్రీ పండుగను జరుపుకుంది. ఆదివారం రోజు మకర సంక్రాంతి జరిగింది. మాఘ బిహు పండుగ కూడా వస్తోంది. ఈ పండుగలు జరుపుకుంటున్న దేశప్రజలకు నా శుభాకాంక్షలు’’ అని పేర్కొంటూ ప్రధాని మోడీ ఒక ట్వీట్ చేశారు.