PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదల ఎప్పుడంటే?

by Shamantha N |
PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదల ఎప్పుడంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘‘పీఎం కిసాన్‌’’ పథకం కింద 19వ విడతగా నిధులను సోమవార ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. ఈ పథకం మొత్తం రూ.22వేల కోట్ల నిధులను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. బిహార్‌లోని భాగల్పూర్‌లో ప్రధానమంత్రి పీఎం కిసాన్ 19వ విడతను విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ప్రకటించారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం రైతులకు ఏటా ఒక్కో విడత రూ.2వేల చొప్పున మూడువిడతల్లో రూ.6వేల సాయం అందిస్తుంది. ‘‘పీఎం కిసాన్‌’’ పథకాన్ని కేంద్రం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఇప్పటివరకు 11 కోట్లమంది రైతులకు 18 వాయిదాల్లో రూ.3.46లక్షల కోట్లు చెల్లించింది. అయితే, ఈ స్కీం ప్రారంభించి ఆరేళ్లయిన 19వ విడత నిధుల విడుదలను సోమవారం విడుదల చేయనున్నట్లు చౌహాన్ వెల్లడించారు. ఈసారి 19వ విడతలో రూ.22 కోట్ల నిధులను 9.8 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమచేయనున్నట్లు వెల్లడించారు.

కిసాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమం

తొలివిడతలో రూ.6,324.24 కోట్లతో ప్రారంభమైన ఈ పథకం 18వ విడత వచ్చేసరికి రూ.20,665.17 కోట్లకు చేరింది. అయితే, గతేడాది ఆగస్టు-నవంబరు మధ్యకాలంలో విడుదల చేసిన 18వ విడతలో ఏపీలో 41,22,499 మందికి రూ.836.31 కోట్లు, తెలంగాణలో 30,77,426 మందికి 627.46 కోట్లు ఈ పథకం కింద విడుదల చేశారు. అంతేకాకుండా, పీఎం కిసాన్ పథకానికి ఆరేళ్లయిన సందర్భంగా సోమవారం దేశవ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాల్లో ‘‘కిసాన్‌ సమ్మాన్‌ సమారోహ్‌’’ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ కార్యక్రమంలో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న వివిధ పథకాల గురించి అవగాహన కల్పించనున్నారు.



Next Story

Most Viewed