- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Red Fort : ఎర్రకోటను అప్పగించాలని మొఘల్ వారసుల పిటిషన్.. కోర్ట్ రియాక్షన్ ఇదే
దిశ, వెబ్ డెస్క్ : ఎర్రకోట(Red Fort)ను తమకు అప్పగించాలని మొఘల్ వారసులు(Mughal successors) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఎర్రకోటను తమ పూర్వీకులు నిర్మించారని, దానిని తమకు ఇచ్చేయాలని మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్-11(Bahdur Shah Japher-11) ముని మనవడి భార్య సుల్తానాబేగం(SulthanaBegum) ఢిల్లీ హైకోర్టులో 2021లో పిటిషన్ వేశారు. గతంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ(East India Compeny) తమ పూర్వీకుల నుంచి అక్రమంగా తీసుకున్న ఎర్రకోటను తమకు అప్పగించాలని అందులో పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై రెండున్నరేళ్ల అనంతరం మళ్లీ కోర్టుకు వెళ్లారు. మొదటి స్వాతంత్య్ర యుద్ధం తరువాత మొఘలుల ఆస్తులు, కట్టడాలను బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారని పిటిషన్ లో వివరించారు. అనంతరం దేశం విడిచి వెళ్లిపోయిన అప్పటి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్-11.. 1862 నవంబర్ 11న మృతి చెందారని తెలిపారు. కాగా తమ పూర్వీకులు నిర్మించిన ఎర్రకోటను భారత ప్రభుత్వం ఆక్రమించుకుందని, తమ ఆస్తిని తిరిగి ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం అప్పగించడానికి సిద్దంగా లేకపోతే, తమకు తగిన పరిహారం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 2021లో దీనిపై అప్పీల్ దాఖలు చేశానని, తన కుమార్తె మరణం వల్ల తాను తీవ్రంగా కుంగిపోవడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించలేక పోయానని సుల్తానాబేగం న్యాయస్థానానికి తెలియజేశారు. దీనిపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బఖ్రు, జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం ఆమె చేసిన అప్పీల్‌ను తోసిపుచ్చింది. బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్న 150 ఏళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించడాన్ని బెంచ్ తప్పుపట్టింది. అప్పీల్ చేసుకోవడంలో జరిగిన విపరీత జాప్యం కారణంగా ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది.