- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
14 మందితో పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ..నామినేట్ చేసిన స్పీకర్ ఓం బిర్లా
దిశ, నేషనల్ బ్యూరో: 14 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. సుదీప్ బంధోపాధ్యాయ, గౌరవ్ గొగోయ్, దయానిధి మారన్, పీపీ చౌదరి, అనురాగ్ ఠాకూర్ లతో పాటు తదితరులను సభ్యులుగా నామినేట్ చేశారు. వారితో పాటు లవు శ్రీ కృష్ణ దేవరాయలు, డాక్టర్ నిషికాంత్ దూబే, డాక్టర్ సంజయ్ జైస్వాల్, దిలేశ్వర్ కమైత్, భర్తృహరి మహతాబ్ దయానిధి మారన్, అరవింద్ గణపత్ సావంత్, కొడికున్నిల్ సురేష్, లాల్జీ వర్మలకు అవకాశం కల్పించారు. గురువారం నుంచే అమల్లోకి వచ్చే ఈ కమిటీకి బిర్లా అధ్యక్షునిగా ఉండనున్నారు. కాగా, లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో స్పీకర్‌తో సహా 15 మంది సభ్యులు ఉంటారు. ఇది ప్రభుత్వ వ్యవహారాల కోసం చర్చా సమయాన్ని సిఫార్సు చేస్తుంది. అంతేగాక సభలో చర్చకు సంబంధించిన అంశాలను సూచిస్తుంది. జూలై 22 నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ కమిటీని నియమించడం గమనార్హం.