Tejashwi: అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి?- తేజస్వి

by Shamantha N |
Tejashwi: అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి?- తేజస్వి
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌ ఎన్నికల వేళ అధికార జేడీ(యూ), ప్రతిపక్ష ఆర్జేడీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. అయితే, తమతో పెట్టుపెట్టుకునేందుకు జేడీ(యూ) అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఆర్జేడీ ఆహ్వానించినట్లు ప్రచారం కొనసాగుతోంది. కాగా.. ఈ వార్తలపై ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్(Tejashwi Yadav) మండిపడ్డాడు. నితీశ్ ను మళ్లీ తమ కూటమిలో భాగం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలన్నారు. తేజస్వి మాట్లాడుతూ.. ‘‘అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి? మేం ఆయన్ని మళ్లీ ఎందుకు మా కూటమిలోకి ఆహ్వానిస్తాం?. అలాంటి ఆఫర్‌ ఏమీ ఇవ్వలేదు. మీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకుని అవాస్తవాలు ప్రచారం చేయకండి. ఇతరుకు ఆఫర్లు ఇచ్చేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నాకు తప్ప మరెవరికీ అధికారం లేదు. అలాంటప్పుడు ఆ ఆఫర్‌ ఇచ్చింది ఎవరు?’’ అంటూ తేజస్వి యాదవ్ ప్రశ్నించారు.

అసెంబ్లీలో..

అంతకుముందు, అసెంబ్లీలో తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తేజస్వీ యాదవ్‌పై నీతీశ్ కుమార్‌ మండిపడ్డారు. గతంలో బిహార్ పరిస్థితిని వివరిస్తూ.. తేజస్విపై విమర్శలు గుప్పించారు. తన కారణంగానే లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో ఎదిగారని వ్యాఖ్యానించారు. ఆయనకు అండగా ఎందుకు నిలుస్తున్నారని లాలూ సొంత మనుషులే అడిగారని చెప్పారు. అయినా, లాలూకు తాను మద్దతు ఇచ్చానంటూ పేర్కొన్నారు. కాగా.. ఇప్పుడు నితీశ్‌పై లాలూ కుమారుడు తేజస్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, అసెంబ్లీలో సైతం నితీశ్ పై తేజస్వి విరుచుకుపడ్డారు. నితీశ్ ని విమర్శించిన వాళ్లే ఇప్పుడు ఆయన కింద పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జేడీ(యూ), ఆర్జేడీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Next Story

Most Viewed