కేజ్రీవాల్‌కు వరుస సమన్లు.. ఈడీకి ఆప్ ఒక్క ప్రశ్న ఇదే

by Hajipasha |
కేజ్రీవాల్‌కు వరుస సమన్లు.. ఈడీకి ఆప్ ఒక్క ప్రశ్న ఇదే
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిందితుడు కాడని చెబుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ).. మరెందుకు ఆయనకు సమన్లు జారీ చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది. ఆప్ నాయకులెవరూ అవినీతికి పాల్పడలేదని, ఎవరూ బీజేపీలో చేరబోరని తేల్చి చెప్పింది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా కేజ్రీవాల్‌‌ను అడ్డుకునేందుకే.. ఆయనను అరెస్టు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్‌కు గత వారం ఈడీ వరుసగా నాలుగోసారి సమన్లు ​​జారీ చేసిన నేపథ్యంలో ఆప్ ఈమేరకు ప్రకటనతో కౌంటర్ ఇచ్చింది. ఈడీ సమన్ల వెనుక రాజకీయ వేధింపులకు పాల్పడాలనే దురుద్దేశం దాగి ఉందని స్పష్టం చేసింది.

Next Story

Most Viewed