డిఫరెంట్ థీమ్‌తో ఆకట్టుకుంటున్న ఆధార్ వినాయక

by Harish |   ( Updated:2022-09-01 12:00:14.0  )
డిఫరెంట్ థీమ్‌తో ఆకట్టుకుంటున్న ఆధార్ వినాయక
X

రాంచీ: గణేష్ ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో జార్ఖండ్ జంషేడ్‌పూర్‌లో వినాయక ఉత్సవ కమిటీ వినూత్నంగా ఆలోచన చేసింది. వినాయకుడికి ఏకంగా ఆధార్ కార్డు మండపాన్ని రూపొందించింది. గణేశుడి చిరునామా కైలాసంగా పేర్కొంటూ, 6వ శతాబ్దంలో ఆయన పుట్టిన తేదీని గుర్తిస్తూ, ఆధార్ కార్డు ఆకారంలో ఒక పెద్ద ఫ్లెక్సీ తో కూడిన మండపాన్ని ఏర్పాటు చేశారు.



ఫెక్ల్సీ లోపల వినాయక విగ్రహం ఉంది. ఫ్లెక్సీపై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు, స్క్రీన్‌పై లార్డ్ గణేశ చిత్రాల కోసం గూగుల్ లింక్ ఓపెన్ అయ్యేలా అనుసంధానం చేశారు. ఈ మండప నిర్వాహకుడు సరవ్ కుమార్ మాట్లాడుతూ.. కోల్‌కతాను సందర్శించినపుడు ఫేస్‌బుక్ మండపాన్ని చూసి ప్రేరణ పొందినట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాము కూడా ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచనతో గణేష్ పూజకు ఈ ఆధార్ కార్డు మండపం ఏర్పాటు చేశామని అన్నారు.

దీని ద్వారా ఆధార్ తీసుకొని వారు తీసుకోవాలనే సందేశాన్ని కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దేవుడికే ఆధార్ కార్డు ఉంటే మనుషులమైన మనం కూడా అనుసరించాలని తెలిపారు. కాగా, ఈ మండపం వద్ద సెల్ఫీలు దిగేందుకు జనం బారులు తీరారు. గతంలో కాళీ మాత విగ్రహాన్ని కూడా ఇదే తరహాలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Also Read : వినాయకుడు ముందు గుంజీలు ఎందుకు తీస్తారో తెలుసా?

Advertisement

Next Story