రాజకీయ బలం కాదు, నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి: పంజాబ్ సీఎం

by S Gopi |
రాజకీయ బలం కాదు, నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి: పంజాబ్ సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ పార్టీ నేతలు చేపట్టిన నిరాహార దీక్ష నేపథ్యంలో పంజాబ్ సీఎం భగవంత్ మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ బలాబలాలను ప్రదర్శించడానికి సమయం కాదని, నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగా గట్టి సందేశాన్ని ఇవ్వాల్సిన సందర్భమని వెల్లడించారు. 'ఈరోజు అందరం మనకు స్వేచ్ఛను అందించిన భగత్ సింగ్ గ్రామంలో ఉన్నాం. కానీ ప్రస్తుతం ఆ స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. మనకోసం బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చారు, అది కూడా ప్రమాదంలో ఉందని' ఆందోళన వ్యక్తం చేశారు. పాలక బీజేపీ సర్కారు ప్రతిపక్షాలను అణచివేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. మనమంతా నిజాయితీతో పారదర్శకంగా రాజకీయాలు చేస్తామని తెలుసుకుని కాషాయ పార్టీ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేసింది. బీజేపీ నాయకులు మనల్ని చూసి భయపడ్డారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే భగత్ సింగ్ స్వగ్రామం ఖట్కర్ కలాన్‌లో భగత్ సింగ్‌కు భగవంత్ మాన్ నివాళులు అర్పించారు.

Next Story

Most Viewed