- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
North Korea : మరో అణు పరీక్షకు సిద్ధమైన ఉత్తర కొరియా
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర కొరియా(North Korea) ఇప్పటికే పలుమార్లు అణ్వాయుధ పరీక్షలు(Nuclear Weapons Tests) జరిపిన విషయం తెలిసిందే. తాజాగా మరో అణు పరీక్షకు సిద్ధం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉత్తర కొరియా ఏర్పాట్లపై దక్షిణ కొరియా(South Korea) మిలిటరీ ఇంటలిజెన్స్ ఏజన్సీ తన వివరాలను చట్టసభ సభ్యులకు అందజేసింది. ఈసారి పరీక్షించబోయే దీర్ఘశ్రేణి క్షిపణి అమెరికాలోని లక్ష్యాలను సులువుగా చేధించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని దక్షిణ కొరియా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచం అంతా అణ్వాయుధాలకు వ్యతిరేకంగా గళం విప్పుతుంటే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్(Kim Jong) మాత్రం తమ రూటే సపరేటు అంటూ.. అణ్వాయుధ పరీక్షలకు ఎగబడుతున్నాడు. ఇప్పటికే ఆరు శక్తివంతమైన అణ్వాయుధాలను కిమ్ నేతృత్వంలో విజయవంతంగా పరీక్షించగా.. తాజాగా ఏడవ అణు క్షిపణి పరీక్షకు కిమ్ సిద్ధం అవుతుండటం ప్రపంచాన్ని ఒకింత భయాందోళనకు గురి చేస్తోంది.