- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు: అసోం సీఎం బిస్వశర్మ
దిశ, నేషనల్ బ్యూరో: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) హవా కొనసాగిస్తుందని అసోం సీఎం హిమంత బిస్వశర్మ దీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో 25 లోక్‌సభ సీట్లకు గాను 22 స్థానాల్లో విజయం సాధిస్తామని వెల్లడించారు. గురువారం ఆయన గువహటిలో మీడియాతో మాట్లాడారు. అసోంలోని 14 స్థానాలకు గాను 11 చోట్ల బీజేపీ గెలుపొందడం ఖాయమని తెలిపారు. ఎన్నికల్లో పోటీ లేనే లేదని తేల్చి చెప్పారు. ఎలక్షన్స్‌ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అభివృద్ధి పనులపైనే ప్రస్తుతం ఫోకస్ చేశామని తెలిపారు. శుక్రవారం ప్రధాని మోడీ అసోంలో పర్యటిస్తారని చెప్పారు. సుమారు రూ.18000కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని తెలిపారు.
అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలను ఈశాన్య ప్రాంతాలుగా పిలుస్తారు. ఈ రాష్ట్రాల్లో మొత్తం 25 పార్లమెంటు స్థానాలున్నాయి. 2019లో బీజేపీ 14 సీట్లు గెలుచుకోగా, దాని మిత్ర పక్షాలు 4 చోట్ల గెలుపొందాయి. మొత్తంగా ఎన్డీయే కూటమి 18 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక, అసోంలో బీజేపీ 9 సీట్లు గెలవగా, కాంగ్రెస్ 3 ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) 1, ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. కాగా, అసోంలో 14 సీట్లకు గాను ప్రస్తుతం బీజేపీ 11, దాని మిత్ర పక్షమైన అసోం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీలు మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.