- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో NIA చార్జ్‌షీట్.. వెలుగులోకి సంచలన విషయాలు
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్(Rameswaram Cafe)లో 2024 మార్చి 1 శుక్రవారం బాంబ్ బ్లాస్ట్ (Bomb Blast) ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఈ పేలుడుతో భారీ కుట్ర దాగి ఉందని గమనించిన ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. ఈ బ్లాస్ట్ కు సంబంధించిన మొత్తం నలుగురు నింధితులను గుర్తించి.. 2025 సెప్టెంబర్ 9 సోమవారం NIA చార్జ్‌షీట్ సమర్పించింది. ఇందులో ఐసిస్ ఆల్ హింద్ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులపై అభియోగాలు మోపింది. నింధితులు ముసవిర్, మతీన్, మునీర్, షరీఫ్‌లగా గుర్తించింది. అలాగే ఎన్ఐఐ తన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలను ప్రస్తావించింది. డార్క్‌వెబ్ ద్వారా నిందితులు పరిచయాలు పెంచుకున్నారని.. ఐసిస్ సౌత్ ఇండియా చీఫ్ అమీర్‌తో కలిపి కుట్రలు చేశారని.. అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజున పేలుళ్లకు కుట్ర చేశారని.. బెంగళూరులోని బీజేపీ కేంద్ర కార్యాలయం పై దాడికి కూడా ప్లాన్ చేశారని.. వీటితో పాటు దేశంలో పలు చోట్ల దాడులు చేసి అశాంతి నెలకొల్పాలనే టార్గెట్ పెట్టుకున్నారని.. వీరంత టెలీగ్రామ్ యాప్ ద్వారా టచ్‌లో ఉండి దాడులకు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ(NIA) తన చార్జ్ షీట్ లో తెలిపింది.