నవజాత శిశువుకు ఎక్స్‌పైరీ సెలైన్ ఎక్కించిన వైద్య సిబ్బంది

by John Kora |
నవజాత శిశువుకు ఎక్స్‌పైరీ సెలైన్ ఎక్కించిన వైద్య సిబ్బంది
X

- చిన్నారి మృతి

- ఇద్దరు నర్స్‌ల సస్పెండ్

దిశ, నేషనల్ బ్యూరో:

నవజాత శిశువుకు వైద్య సిబ్బంది ఎక్స్‌పైరీ అయిన సెలైన్ ఎక్కించడంతో మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిల్బిత్‌లో చోటు చేసుకుంది. జిల్లా ఆసుపత్రిలోఉన్నస్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్‌సీయూ)లో చికిత్స పొందుతున్న రెండు రోజుల వయసున్న చిన్నారికి అక్కడి సిబ్బంది కాలం చెల్లిన సెలైన్‌ను ఎక్కించారని, దీంతో శిశువు చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జనవరి 27న రాధా సింగ్ అనే గర్భిణి ఇంటి దగ్గరే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువు పాలు తాగడం మానేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రిలోని ఎన్ఎన్‌సీయూకి తరలించారు. కానీ కాసేపటికే బిడ్డ పరిస్థితి విషమించడంతో లక్నోకు తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. దీంతో శిశువును లక్నోకు ఆంబులెన్సులో తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వార్డులో ఎక్స్‌పైరీ అయిన ఫ్లూయిడ్స్ వాడారని వారు చెబుతున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్‌కు తరలించారు. ఈ ఘటనలో బాధ్యులుగా భావిస్తున్న ఇద్దరు నర్సులను సస్పెండ్ చేసి, అధికారులు విచారణకు ఆదేశించారు.


Next Story

Most Viewed